Meta tags:
description= కిరణ్ తెలుగు బ్లాగు;
Headings (most frequently used words):
తెలుగు, ఝుం, ఝం, లేదు, డింగ్, తేట, తేనె, వంటి, తుమ్మెదలుమ్మడి, భారతీయభాషలలో, ఉన్నతవృత్తివిద్యల, లభ్యత, యొక్క, అవసరము, వాగ్బంధనం, పరితాపమేదీ, నల్లటి, సీతాకోకచిలుకలు, నా, వయసులోని, అందరు, అమ్మాయిలు, అబ్బాయిలు, శతాక్షర, వజ్రసత్వమంత్రం, జీవించి, ఉండడం, సా, గీతం, పైకి, చంద్రునివైపుకి, నువ్వూనేను, మన్, తో, మొదటిచూపులోనే, నీకు, మనసిచ్చాను,
Text of the page (most frequently used words):
కూడా (28), లేదు (27), అను (26), #తెలుగు (25), పాట (23), కానీ (23), posted (20), వ్యాఖ్యానించండి (20), నేను (20), నువ్వూనేను (20), నాకు (18), ఇది (15), ఝుం (14), వంటి (12), యొక్క (12), అని (12), నుండి (12), సీతాకోకచిలుకలు (12), నిన్ను (11), uncategorized (10), ఆహా (10), అన్ని (10), కాదు (10), అంటే (9), వయసులోని (9), అమ్మాయిలు (9), నల్ల (9), భాష (9), నన్ను (8), దుగ్లి (8), దగ్లి (8), దలాలో (8), డింగ్ (8), అనువాదం (7), అఁటిఁచబడ్డవి (7), 2020 (7), మనం (7), కలిసి (7), వివిధ (7), ద్వారా (7), ఇటువంటి (7), ఎడమచేయి (7), అందరు (7), అబ్బాయిలు (7), వలన (7), తేనె (6), విశ్వవ్యాప్తిమైన (6), అన్న (6), వచ్చిన (6), అనే (6), క్రింద (6), పాడిన (6), మనము (6), భారతీయభాషలలో (6), కొన్ని (6), అది (6), సంవత్సరంలో (6), కుడిచేయి (6), పాటని (6), పియాఫ్ (6), తుమ్మెదలుమ్మడి (6), పేరు (5), తేట (5), అక్కడ (5), మరి (5), లేకుండా (5), ఇలా (5), వారి (5), పాటలు (5), తరువాత (5), అత్యున్నత (5), ఒంటరిగా (5), నల్లటి (5), వృత్తివిద్యలు (5), క్రొత్త (5), అనుసంధానభాష (5), సంస్కృతి (4), ఇదే (4), మొదటిచూపులోనే (4), నువ్వు (4), ఓయి (4), పిల్లా (4), సూరీడూ (4), ప్రేమిస్తున్నానే (4), నీకు (4), ఎలా (4), అక్టోబర్ (4), ఒకటే (4), చీనా (4), అనేక (4), ఈమె (4), మునుపు (4), భారతదేశంలో (4), ఇందు (4), తిరిగి (4), ఎంతో (4), గాయని (4), సాంస్కృతిక (4), ఉండడం (4), పాడి (4), వజ్రీ (4), మహాసమయసత్వ (4), సర్వ (4), భగవాన్ (4), సర్వతథాగత (4), వజ్ర (4), మూంచ (4), హూం (4), హోః (4), చిత్తశ్రేయః (4), కురు (4), నాయందు (4), ఉండు (4), నవంబర్ (4), చేసిన (4), ఫ్రెంచి (4), రెండూ (4), ఔను (4), పోతాను (4), గేన్స్బూర్ (4), ఏదో (4), నల్లగా (4), ఎదిత్ (4), రియాన్ (4), పరితాపమేదీ (4), అసలేదీ (4), పరితాపం (4), కాని (4), శెలవు (4), అవసరము (4), వాదన (4), భాషలు (4), భాషను (4), మాట్లాడే (4), కనుక (4), సంస్కృతము (4), ఆంగ్లములో (4), పాఠ్యపుస్తకాలు (4), మాతృభాషల్లో (4), మనిషి (4), చూడండి (3), సంస్కృతిలో (3), సంగీతబృందం (3), పాటను (3), ఎన్నెన్నో (3), మనసిచ్చాను (3), ఆనందంగా (3), ఇద్దరు (3), ఆకాశంలో (3), వారికి (3), నిండిన (3), మన్ (3), ఆపై (3), దేశం (3), సాహిత్యం (3), విషయం (3), రోమకలిపిని (3), చూడవచ్చు (3), ఆంగ్లంలో (3), చీనేయగాయని (3), పాడింది (3), చంద్రుడు (3), అనగా (3), చిహ్నం (3), అసలు (3), నూతన (3), అనాదికాలం (3), ద్వారానే (3), అదే (3), దేశానికి (3), చంద్రునివైపుకి (3), మధ్యన (3), ప్రేమని (3), పట్టుంది (3), పైకి (3), శతాక్షర (3), వజ్రసత్వమంత్రం (3), కచ్చితంగా (3), అట్లే (3), కల్పించు (3), తెలుగులో (3), ఫ్రెంచిభాషలో (3), కళ్ళల్లో (3), చేతిలో (3), మర్నాడంటే (3), భయంలేక (3), రోజు (3), బాగా (3), సీతాకోకచిలుకని (3), అద్దంలో (3), మొత్తమంతా (3), ఆయన (3), అదంతా (3), మోసపెట్టడానికి (3), ట్వీటుపెట్టడానికి (3), మరీ (3), నువ్వేంచూశావో (3), చెప్తా (3), విను (3), కల్పితవార్తలకిక (3), విద్యాబోధన (3), ఆంగ్లేతర (3), మాతృభాషలో (3), విద్యార్థులకు (3), భాషలో (3), ప్రజలు (3), వృత్తివిద్యలను (3), అవి (3), ఆర్థిక (3), ఉండాలి (3), మూలముగా (3), ఎటువంటి (3), అంశము (3), హిందీ (3), బువ్వ (3), wordpress (2), com (2), వెబ్ (2), సైటు (2), తప్పనిసరి (2), subscribed (2), subscribe (2), వర్డ్ (2), ప్రెస్ (2), కామ్ (2), లేదా (2), పాత (2), టపాలు (2), పాడే (2), త్రియో (2), మందిలి (2), బృందం (2), అనువదించాను (2), కాలేజీకి (2), ఉండేది (2), అరుగునీడలో (2), సేదతీరుతుండగా (2), మధురమైనక్షణంలో (2), వ్యక్తులు (2), ఇద్దరి (2), ముఖాలు (2), మనసు (2), నక్షత్రాలు (2), చంద్రుడిని (2), రెండిటీ (2), అవతల (2), పరమానందంలో (2), ఐక్యమయ్యాము (2), మాయావ్యామోహాలనుండి (2), విముక్తులై (2), బ్రహ్మానందంతో (2), స్వర్గంలో (2), విధంగా (2), చోట (2), లోను (2), ఆనందం (2), ఫార్సీ (2), కవిత (2), ఎలెక్ట్రానిక్ (2), యువకులు (2), బెర్లిన్ (2), విడుదల (2), చేశారు (2), సంగీతం (2), విపరీతమైన (2), దేశంలో (2), చేస్తున్న (2), ముందుగా (2), కవి (2), రూమీ (2), విశ్వవ్యాప్తంగా (2), సుడికారాలను (2), ఉన్నది (2), తరుచుగా (2), దురదృష్టవశాత్తూ (2), ఆంగ్లేయులు (2), రుద్దిన (2), మనకు (2), త్వరలోనే (2), చిత్రికలో (2), టివీ (2), తోడుగా (2), వచ్చాయి (2), ఉంది (2), అర్థం (2), పేర్కొన్నాడు (2), భారతీయ (2), నమ్మకాలు (2), వేరే (2), వెనుక (2), మోక్షసాధన (2), మాత్రం (2), నడుస్తుంది (2), ఉన్నా (2), జీవితాలు (2), తేలుతూ (2), లోలోపల (2), 2007వ (2), జీవించి (2), ఇంద్రుని (2), సాధకుడు (2), వజ్రం (2), కదా (2), జ్ఞానాన్ని (2), బౌద్ధమతంలో (2), కలిగిన (2), దేవతను (2), పిలుస్తారు (2), అనుగ్రహించు (2), తథాగత (2), అంటారు (2), అన్నమాట (2), కదులుతూ (2), అందుకని (2), భగవంతుడా (2), విడనాడకు (2), కర్మలయందు (2), చిత్తము (2), సర్వకర్మసుచ (2), యజ్ఞబంధమనే (2), కలిగి (2), సర్వకర్మసు (2), ప్రయచ్ఛ (2), అనురక్తో (2), సుపోష్యో (2), సుతోష్యో (2), వజ్రసత్వత్వేన (2), ఉపతిష్ఠదృఢో (2), వజ్రసత్వ (2), సమయమనుపాలయ (2), గీతం (2), ఫ్రాన్సువాజ్ (2), ఎందరో (2), అప్పుడు (2), అమ్మాయిల్లాగ (2), అబ్బాయిల్లాగ (2), ఏమిటో (2), ఎప్పుడు (2), నిండుగా (2), రోజులు (2), ఎలాగో (2), రాత్రులు (2), అలాగే (2), అన్నివిధాలా (2), ఉల్లాసంలేక (2), విసుగెత్తి (2), తెలుసు (2), కళ్ళుంచి (2), చేయుంచి (2), పోతున్నారు (2), ప్రేమికులై (2), వీధుళ్లో (2), గుండెదిగులుగా (2), ప్రేమించేవాడు (2), లేడుగనుక (2), గాయకుడు (2), విడుదలయ్యింది (2), ఆలపించింది (2), అప్పటికే (2), పేరొందిన (2), చొక్కాపై (2), ఎప్పటికీ (2), నోన్ (2), ఒకటి (2), ద్యుమోన్ (2), ఆమె (2), ఒకసారి (2), రెగ్రెత్ (2), వాళ్ళు (2), మంచిని (2), కీడుని (2), సమానమే (2), ఉంటాయి (2), తిండానికి (2), తీపిగా (2), నిజం (2), గిరి (2), విమర్శలు (2), తియ్యగా (2), అలా (2), వాగ్బంధనం (2), 2022 (2), వృత్తివిద్యలకు (2), యంత్రనిర్మాణ (2), సహజముగానే (2), మర్యాద (2), విషయమేమిటంటే (2), ఎందుకు (2), ప్రజల (2), ఆర్థికప్రగతి (2), భారతీయభాషల (2), మరింత (2), సులభతరమైన (2), విశ్వవిద్యాలయందు (2), అనేకులు (2), భాషలకు (2), ఆంగ్లము (2), సామాజిక (2), అంబేద్కరు (2), సిద్ధాంతము (2), అత్యల్పము (2), పదాలు (2), శాస్త్రీయ (2), అతి (2), ప్రౌఢమైన (2), ఇత్యాది (2), శబ్దాలు (2), వాదనే (2), తూర్పు (2), పాఠ్యపుస్తకాలను (2), విద్యార్థులు (2), మరియు (2), శాస్త్రీయపత్రాలు (2), ఆంగ్లములోనే (2), మాత్రము (2), మేధావులకు (2), జర్మన (2), జర్మనభాషలో (2), ఒకానొక (2), ఈనాటి (2), ప్రపంచములో (2), దేశము (2), నిస్సందేహముగా (2), ప్రాకృతము (2), కారణాన (2), మార్షల్ (2), మక్లుహాన్ (2), పనిముట్లను (2), వివేకము (2), ప్రభుత్వము (2), భారతీయభాషామాధ్యమంలో (2), ఉద్యమం (2), తేవె (2), తుమ్మెద (2), కిరణ్ (2), బ్లాగు (2), మొదలుపెట్టండి, design, site, like, this, with, ఈమెయిలు, వ్యాఖ్య, రాయండి, loading, comments, పట్టీని, కుదించు, చందాల, నిర్వహణ, సైటుని, రీడరులో, విషయాన్ని, నివేదించండి, లోనికి, ప్రవేశించండి, నమోదవ్వండి, అంతరంగికత, already, have, account, log, now, చేర్చుకో, అలంకారం, coraline, ఉచిత, బ్లాగును, సృష్టించుకోండి, బ్లాగండి, వెతికింది, జార్జియా, చర్చిలో, అందరూకలిపి, బృందగానం, పాడడం, ఆనవాయితీ, క్రైస్తవసన్యాసుల, మఠాలలో, సంయుక్తగానం, మొదలయ్యింది, జానపదులలో, వ్యాప్తిచెందింది, జార్జియాదేశానికి, చెందిన, జానపదగీతం, ఎర్తీ, నఖ్విత్, ప్రేమించాను, పైన, వాయించింది, చ్వేనేబురేబి, చిత్రిక, మధ్యలో, అమ్మాయి, వేరొక, గాయనీబృందంలో, ఒకతె, గాయనీబృందం, ఆలపించారు, మరికొన్ని, పాటలను, నిన్న, పోతే, ఇంటిదగ్గరుంటా, సాయంత్రంపూట, ప్లెఖానోవ్స్కీ, పార్కులో, సరదాగా, నడుద్దాం, తిబిలీసీకొచ్చాక, అక్కడొక, వాటా, అద్దెకి, తీసుకుందాం, జోళ్ళు, జిగేళుమనే, గాజు, దీపాలు, కొనుక్కుందాం, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నావు, ఇంక, ఇక్కడెలా, పోదాం, తిబిలీసీకి, పోయి, చదువుకుందాం, మారో, క్రోకీనామామయ్య, కూతురా, చెప్పు, ఉండగలను, తోటలోని, సడి, పక్షుల, కిలకిల, మనకి, ప్రాణం, నింపుతున్నాయి, తోటలోకి, అడుగిడగా, వస్తున్నాయి, మనల్ని, చూద్దామని, ప్రేమబింబమైన, చూపిస్తున్నాం, చిలుకలన్నీ, పలకడం, మొదలుపెట్టాయి, ఒకరితోఒకరు, నవ్వుతుండగా, దానికన్నా, విలువైనది, ఏకాంతపు, ఒకే, క్షణంలో, ఇరాక్, ఖొరాసాన్, భూమిపై, వ్యక్తిరూపంలో, ఉన్నాము, ప్రతివ్యక్తిరూపంలోనూ, అనంతమైన, తలంలో, పూర్తి, కవితను, అనువదించుతున్నాను, భాషలోని, సంగీతంతో, మేళవించి, అనూష్, అరాష్, పారసీక, జర్మనీలోని, నగరంలో, ముద్రణ, అన్, డీజే, సమకూర్చగా, నగరంలోను, ప్రపంచవ్యాప్తంగాను, ప్రాచుర్యం, పొందింది, సంగీతంపై, మమకారంతో, ఇరాన్, ప్రభుత్వం, కట్టడిని, తట్టుకోలేక, తెగించి, విడిచి, జర్మనీకి, పలాయనం, ఇరానుదేశపు, జలాలుద్దీన్, రచించాడట, అతని, దివాన్, షంస్, కవితాసంపుటినుండి, స్వీకృతమయ్యింది, సూఫీ, ప్రాచుర్యంలోకి, అందరికీ, విదితమే, చీనాభాషను, ఇతరదేశాలవాళ్లు, పలకడానికి, వీలుగా, ఆధారంచేసుకుని, పిన్యిన్, లిపి, ఉపయోగిస్తారు, లిపిలో, భాషకి, అనుగుణంగా, మలుచుకుని, గుణింతాలని, పోలిన, ఏర్పరుచుకున్నారు, అంతర్జాతీయ, సంస్కృతలీపీకరణం, ఎస్, రోమకలిపి, ఏక్సెంట్, వినియోగించుకుంటే, భాషలలోని, పదాలకు, వ్రాసినప్పుడు, సందిగ్ధం, ఉండదు, భారతీయులు, లిపిని, వినియోగించక, మూర్ఖులైన, మనపై, బండలిపి, అయిన, ఆంగ్లలిపిలోనే, మనుష్యుల, నగరాల, పేర్లను, వ్రాస్తున్నాము, మొదలైన, దేశాలవలనే, సమ్మతమైన, వినియోగించుకుంటామని, కార్యక్రమంలోని, కథలోని, అంశాలను, అభిమాని, గ్రహించి, పాటకు, పెట్టాడు, మహత్ప్రాచుర్యంలోకి, సంస్కృతశ్లోకాన్ని, పాటగా, రేపు, అనువదిస్తాను, అమరత్వానికి, మోక్షప్రదమైన, పరమానందానికి, ఉన్నట్టే, సోమరూపంలో, చూసినప్పుడు, భారతదేశం, కొన్నిచోట్ల, పలకలేక, హిందు, అంటారని, షువెన్, ఝాంగ్, హ్యువెన్, త్సాంగ్, పన్నెండేళ్లు, గడిపిన, బౌద్ధయాత్రికుడు, పదం, వైదికక్రతువులలో, సోమరసం, పట్టే, యూపపాత్ర, వచ్చిందని, కొందరి, విజ్ఞుల, అభిప్రాయం, వైదిక, యజ్ఞం, నక్షత్రాల, గమనాన్ని, లెక్కించి, కాలం, పునరారంభం, అయ్యే, యుగాది, ఘడియను, జ్యోతిషశాస్త్రం, గణిస్తుంది, ఖగోళ, పరిశీలనలు, గ్రహాల, చలనకక్ష్యావిశేషాలు, భారతీయశాస్త్రజ్ఞులు, గణిస్తూవున్నారు, నక్షత్రపరిశీలనము, కాలగణనము, వ్యవసాయవృత్తిని, నడుపుకుని, ఆర్థికవృద్ధిని, సాధించడము, నావికా, అన్వేషణం, వ్యాపారార్జన, చెయ్యడము, సాధ్యమయ్యింది, అందువలన, చంద్రుని, గమన, గణనం, పేరునే, ఇచ్చిపెట్టింది, చీనేయులు, మనుష్యులు, పుణ్యం, సంపాదించిన, తరువాతే, మానవజన్మనెత్తుతారని, అమరలోకమైన, స్వర్గం, అత్యున్నతమైన, లోకమని, నమ్మేవారు, ఇటివలి, శతాబ్దాలలో, మనదేశం, పరాయిపాలనలో, బానిసత్వంపాలైన, లేచిపోయాయనుకోండి, పాటలో, వర్ణించిన, ఉందని, గమనించాలి, చీనేయ, జువోషు, యువే, షియాంగ్మీ, చెంచెన్, జిన్రూ, షువాంగ్, ప్రేమయొక్క, భస్మాలు, ఏషెస్, ఆఫ్, లవ్, చీనాదేశపు, కథా, కార్యక్రమంలో, ప్రచురిచతమయ్యింది, కథలో, అమరలోకంలో, దేవతాకన్యగా, జన్మించిన, జిన్మీ, పూలదేవతకి, షుఫెంగ్, అగ్నిదేవతాకుమారునికి, ప్రణయగాథ, పదివేల, ఏళ్ళవరకూ, ఇద్దరూ, అనేకానాక, ఘట్టాల, నడుమ, ఐక్యంచేసుకోలేకపోతారు, దేవదానవమానవరూపాలలో, జన్మనెత్తుతారు, చివరికి, విధినిక్షేపితమైన, అందుకొని, ఐక్యం, అవగలుగుతారు, భారతదేశపు, సంస్కృతివలనే, ప్రాకృతికదేవతా, ప్రభావం, కర్మసిద్ధాంతము, జన్మ, పునర్జన్మలతో, సంసారము, అంతిమంగా, వీటన్నింటిపైనా, ఉన్నాయి, పోలికలు, నుండీ, రెండు, సంస్కృతులలోనూ, బౌద్ధమతం, చీనాలో, వ్యాపించిన, చిహ్నాలు, నెలకొన్నాయి, గట్టిగా, వదిలివేసి, పోనిచ్చింది, చేతులు, గుప్పిట్లో, బిగిస్తే, రూపం, హృదయంలోకొస్తుంది, సాంబ్రాణి, ధూపంలా, నువ్వూ, ఐక్యమయ్యాం, అవిచ్ఛిన్నంగా, అనంతంవరకూ, ఈకలాగ, మారింది, చేపమొప్పులాగా, మబ్బులవాటున, కారడవుల్లోని, నీడలచాటున, సంతోషంగా, అనుసరిస్తాను, చిన్నటి, మట్టినలకలా, మారుతాను, మనుష్యలోకపు, సంసారంలో, అంచులనా, సాగుతూ, చంద్రునివైపుకు, చూపిస్తోంది, విధి, ఎర్రటిదారాలని, చుడుతోంది, కోరుకున్న, దేవతలు, నీకూ, నాకూ, వరమందించుగాక, మిణుకులాడుతున్నా, వెన్నెలలో, నువ్వూనేనూ, ఒకటై, కలిసిపోగా, తాళం, మ్రోగించింది, వీణాస్వరాలని, మీటింది, మరుపు, మహానది, జలాలపై, నావ, వెళ్తోంది, దుఃఖపులోతుల్లోనుండి, అరుణపద్మం, పుట్టగలదు, ఆగవద్దు, మనసును, కదుపు, పెనవేసుకున్న, భావాలని, పువ్వుని, త్రెంచింది, ఖడ్గాన్ని, ఆడించింది, కనుబొమ్మలకి, జారింది, వేయి, సంవత్సరాల, మంచురేఖ, అశ్రుబిందువు, అవతరించాను, భూమిని, ఆకాశాన్ని, అరచేతిరేఖలపై, బద్దలయ్యింది, అన్నివైపులా, మెరుపులాడుతూ, కాలమనే, కెరటాన్ని, ఏరుకుని, సంవత్సరాలుగా, ఇట్టే, పూతపోసి, మూడువేల, జన్మలు, సాంతం, గడిచినా, ఇంకా, కలుసుకోలేదన్నట్టుగా, స్వరాలలో, సహజంగానే, సంస్కృతోచ్ఛారణలో, అపస్వరాలు, దొర్లుతాయి, వాటికి, ఇబ్బందులు, పడకుండా, అనుబంధమైన, చిత్రికను, ఆస్వాదించండి, విడుదలచేసిన, వాన్వూషెంగ్, ఎలైవ్, సంగీతముద్రణలోని, సంస్కృతశ్లోకం, శ్లోకం, బహుప్రసిద్ధమైన, బౌద్ధమంత్రం, దీనిని, గానరూపంలో, అలరించింది, మంత్రంలో, వజ్రతత్వంకలిగిన, అనుగ్రహం, అడుగుతున్నాడు, ఆయుధం, ధ్యానచింతనలో, ప్రగాఢమైన, మనసులోకి, ప్రత్యక్షింపజేసే, అంతర్దృష్టి, అజ్ఞానాన్ని, ఛేదించి, మనోపలకాలపైన, దివ్యమైన, కాంతిరూపంలోని, మెరుపులా, ప్రత్యక్షింపజేసేదే, వజ్రాయుధం, వజ్రశక్తిని, వజ్రసత్త్వుడని, తనని, ఉత్కృష్ఠమైన, బుద్ధావతారంగా, కొలుస్తారు, అటువంటి, యజ్ఞబంధం, అనుసరించి, నిష్ఠగా, ధ్యానంచేసిన, భక్తునిపై, వేడుతున్నాడు, ధ్యానతత్వాన్ని, తఠత, ఎట్లు, ఉన్నదో, తఠస్థంగా, మనసులో, అంగీకరించడం, మనోవికారాలు, ఏమీ, అన్నింటిపైన, వైరాగ్యంతో, కూడిన, నిర్మలతత్వంతో, స్థితి, నిదానంగా, ఋతుక్రమంలో, సమయం, ముందుకువెళ్తున్నా, మనస్చిత్తం, నిర్మలంగా, ఉంటూ, కదలడం, బుద్ధుడిని, తథాగతుడు, మహాసమయసత్వముతో, యజ్ఞబంధముని, అనుసరించిన, తత్వముతో, వజ్రతత్వముగలవాడై, గుణంతో, వజ్రతత్వం, కలిగినవాడా, నిర్మలముగా, చేయి, ఒప్పందము, వజ్రతత్వము, ప్రత్యక్షమవ్వు, స్థితులయందు, తఠస్థతతో, బౌద్ధతత్వం, వజ్రతత్వముగలవాడా, శ్రేయస్సు, నిర్మలత్వము, మనస్సు, సిద్ధిం, సిద్ధులు, అనురాగివై, సుపోషకుడివై, సంతుష్టుడై, వజ్రశక్తినిగలిగిన, తత్వంతో, నాతో, దృఢంగా, కలిసివుండు, వజ్రశక్తినిగలవాడా, ఇంద్రుడా, సాధకునికి, దేవునికి, ఒప్పందాన్ని, అనుపాలించు, పాటించు, అన్వయం, సర్వసిద్ధిం, 1962వ, హార్డీ, గార్సోంజె, ఫియ్, మోనాజ్, ఫ్రెంచిపాట, 60వ, దశకంలో, ఫ్రాన్సుదేశంలో, సంగీతాన్ని, పడుచు, అమెరికాదేశం, వస్తున్న, సంగీతపద్ధతులను, జావళీలను, సంస్కృతికి, అన్వయించాయి, మంచి, గాయనులు, వెలుగులోకి, వచ్చినా, అందులో, హార్డీకి, ప్రత్యేకమైన, స్థానం, ఉంటుంది, దశాబ్దాలుగా, మధురమైన, ఆలపించి, అభిమానులను, చేగొంది, తెలుసుకుంటానా, ప్రేమంటే, అనుకుంటున్నా, వస్తుండా, రోజని, కళ్ళుంచే, చేయుంచే, గుండే, గుండె, దిగులుగా, ఉండనే, ఉండని, ప్రేమించే, ఎవరో, కలిగుండే, నాకోసం, ప్రకాశిస్తాడు, దిండుగా, సూరీడు, కడుతున్నారు, భవిష్యత్తుకి, పథకాలు, ప్రేమించడం, చెవిలో, ప్రేమిస్తున్నా, గుసగుసలాడరు, ఎవరూ, వీధిలో, నడిచిపోతున్నారు, ఇద్దరిద్దరు, ఎట్లుండాలో, ఫ్రాన్స, బిజూ, మణి, ప్రేమికుడు, ఆలాపనని, సార్జ్, వ్రాసిన, పాపియ్యోన్, నువార్, 1966వ, గేన్స్బూర్తో, మిచేల్, ఆర్నో, ఫ్రాన్సుదేశం, తరుపున, యూరోవిజన్, ఐరోపాస్థాయి, గానస్పర్ధాకార్యక్రమంలో, పాల్గొంది, గాయనీగాయకులిద్దరికీ, తెచ్చిపెట్టింది, సంగీతకారుడిగా, కవిగా, గుర్తింపులోకి, వచ్చాడు, ఇతని, పొరలుపొరలుగా, నిమిడిన, గూఢమైన, సాహిత్యంతో, ప్రాసాలంకారాలతో, ఫ్రెంచిభాష, పాటవ్యాన్ని, ప్రదర్శిస్తుంటాయని, అభిమానుల, ప్రశంస, వివాహేతర, రంకుసంబంధాన్ని, నిగూఢంగా, వర్ణిస్తోంది, ప్రణయానికి, వైవాహికబంధానికి, ఐరోపాసంస్కృతిలో, అటువంటిది, తప్పు, పని, సమయానికి, కలిగే, భావనలకు, చిహ్నంగా, సూక్ష్మంగా, సూచిస్తున్నాడు, చూశావు, గుండెకి, దగ్గరగా, పెట్టిన, కోటు, వేసుకునే, ముందున, జేబుపై, మసకగా, ప్రొద్దుటి, వేకువ, వెలుగున, కదలాడే, అలజడి, జలాన, ఆకస్మికంగా, కలిసినప్పుడు, కవ్విస్తున్నారు, వేల, దివ్వెలతో, జిగేలుమనే, నగలతో, రాత్రినడుమన, ఆకర్షిస్తున్నాయి, రాత్రి, బాధలన్నీ, కమ్ముతుండగా, గుండెనిండుగా, ప్రేమిస్తాం, మాయమైపోవనివి, జీవితంపై, మోమ్, కుర్రది, సినిమా, పాత్రని, మారియోన్, కోతియార్, ప్రముఖమైన, అభినేత్రి, పోషించింది, జీవితంలో, ఒడిదుడుకులను, బాధలను, ఉల్లాసాలను, అలల్లాంటి, అలజడిగా, సాగిన, వైనాలను, హృద్యంగా, చిత్రీకరించారు, ఆవిడే, సినిమాలో, ఆవిడ, జీవంపోసిన, వైనం, మహాగాయని, 1956వ, రెగ్రెత, ఫ్రాన్సుదేశంలోనేకాదు, అతిప్రాచుర్యంలోకి, గీతాలలో, చార్ల్, సంగీతకారుడు, కోసమనే, కృతిచేశాడు, మొదట్లో, కలవడానికి, సమయంలేదని, శరీరం, నీరసపడివుందని, నిరాకరించిన, పియానోపై, వాయిస్తే, విని, మహాద్భుతం, పాడతాను, పాటతోనే, ప్రజలందరి, మనసుల్లోను, గుర్తుండిపోతాను, అందట, గొంతుతో, శక్తితో, నిజంగానే, మధురాతిమధురంగా, పశ్చాత్తాపం, పశ్చాత్తాపపడట్లేదు, పదాల, ఇంకో, భావం, తప్పుచేసాను, అనిగాక, ఇతరులు, పనులు, ఇబ్బంది, కలిగించవు, ఎందుకంటే, జీవితం, ఈరోజు, మొదలౌతోంది, నీతోనే, జ్ఞాపకాలతో, నిప్పు, రాజేస్తాను, దుఃఖాలతో, సుఖాలతో, వాటిమీద, అవసరంలేదు, తుడిచిపెట్టేసి, ప్రణయాలన్నీ, వాటి, అలజడులన్నీ, తుడిచిపేట్టేసి, సున్నాపై, మొదలౌతాను, భరించాను, తుడిచిపెట్టేసాను, మరిచిపోయాను, గతమంటే, వెఱ్ఱి, లెక్కలేదు, ప్రపంచ, నియమవిధి, వర్ల్డ్, ఆర్డర్, జపానదేశ, గెంకీ, సూడో, సమకూర్చబడింది, సమకాలీన, విషయాలపై, ఆలోచనలు, రేకెత్తించేలా, వీరి, గీతాలు, సంగీతానుక్రమంగా, విశ్మయాస్పదమైన, అద్భుత, సమపాదగతితో, నాట్యం, చేస్తారు, పెడ్తాను, ప్రతిబింబించినట్లు, నమ్మాలి, నమ్మినట్లు, చూడాలి, పాత్ర, ధరించాలి, పుట్టిన, పుట్టాను, గుర్తు, క్షమించు, గాలిని, చదివి, చూడు, సమాధానం, చెప్పని, సమాధానమేంటో, విమర్శ, వ్యక్తపరచాలి, గదా, తెలుసుకోవడం, కోసం, చెప్పకుండా, ఉంటానని, అనడం, అస్పష్టం, మూడో, మనిషికి, చోటు, వృత్తాల్లో, వృత్తాల్లా, గీసుకోవడాలు, రట్టుపెట్టడాలు, జట్టుకట్టడాలు, గుంపులో, ఇలాంటి, జనాలముందు, ఓడిపోయి, ఓర్వలేను, చుట్టరికాలు, వట్టిపోయి, లక్ష్యం, నిర్దేశం, అన్నీ, వదిలేసి, నడవడులు, అలవాట్లు, నేర్చుకున్న, చేతకానితనం, ప్రతిబింబం, అపరిచయిస్తుల్లా, నగరగర్భంలో, ఆబగా, కలవడం, పద్ధతిలేని, వ్యవస్థ, ఒంటరి, సమాజం, నిలబెట్టి, తినడానికి, ఏమి, తినాలో, పెడ్తా, పట్టనట్టు, నాట్యమాడుతూనే, కల్పిత, సంగీతపు, లయలకు, జాగృతి, వేచిచూస్తోంది, మోసపెట్టడానికన్నా, ట్వీటుపెట్టడానికన్నా, తిండానికన్నా, నీకేదన్నా, పోయిందా, కాగితపు, ముక్కనే, మాటల్లో, పెట్టలేని, మాటలను, పూతేయవచ్చు, నిజమంటే, తయారుచేయబడినదే, సమాధానమివ్వని, విషయాలు, మరలా, చెప్తాను, మాతృభాషమాధ్యమంలో, ప్రాథమికవిద్యలోనే, ఉన్నతవిద్యలకు, అనవసరము, అంతగా, కల్పించాలనుకుంటే, సాంఘికశాస్త్రాలలోనో, సాహిత్యశాస్త్ర, విభాగాలలోనో, పెట్టాలి, వైద్యశాస్త్రాలలో, పెడితే, విద్యాప్రమాణాలు, దెబ్బ, తింటాయి, చేసేవారు, అత్యధికులు, దేశాలలో, విశ్వవిద్యాలయాలు, పనిచేసే, తీరును, దర్శించినవారు, కేవలం, ప్రాథమిక, విద్యాభ్యాసం, ఉండినట్లైతే, మాతృభాషపై, న్యూనతాభావము, ఏర్పడుతుంది, సమాజములో, గుర్తింపుకు, ధనార్జనకు, పనికొచ్చే, లభ్యమవుతుంటే, భాషకు, లభిస్తుంది, స్వాభిమానం, జాతియైనా, యోచించవలసిన, మాతృభాషకు, దక్కలేదు, ముఖ్యముగా, కోట్లాది, మాట్లాడు, సమృద్ధమైన, ప్రాకృతికసంపత్తి, ఆర్థికప్రతిపత్తి, శ్రేష్టాతిశ్రేష్టమైన, విశ్వవిద్యాలయాలను, కలిగియుండాలి, లేవు, న్యూనతాభావనకు, భావదాస్యానికి, నిదర్శనలు, ఇజ్రాయెల్, ప్రాచీన, హీబ్రూ, పునరిద్ధరించినప్పుడు, సంఖ్య, ఎంతనో, లేకున్ననూ, దేశపు, విద్యాస్థానమైన, టెక్నియాన్, యంత్రనిర్మాణవిద్యావిభాగాలను, హీబ్రూభాషలో, రూపొందించింది, యాంత్రీకరణ, సాధిస్తూండగా, భాషాప్రవాహం, విభాగాలకు, వాణిజ్యవిభాగాలకు, చేరింది, పునరుద్ధరణ, కార్యము, పారిశ్రామీకరణము, పురోగతి, సాధించుటకు, మూలసాధనాలైన, విద్యావిభాగాలయందు, స్థాయిలో, జరగాలి, కనీసం, ప్రత్యుమ్నాయంగా, లభ్యమౌతూ, లేదంటే, ఆత్మన్యూనత, స్వాభిమానలోపము, పౌరులందరిలో, మాతృభాషాపాటవము, కృశించి, క్రమక్రమముగా, ఆంగ్లపుటెంగిలి, చొరబడుతుంది, వైపరీత్యాన్ని, ఈనాడు, ఉన్నతవర్గాలవారియందు, అంతటా, గమనిస్తున్నాము, ఇదేమీ, పూర్వకర్మనిర్దేశితము, స్వంత, చేష్టలతో, చేజేతులా, మనమే, కల్పించుకున్నది, మిగతా, దేశాలవారు, మనలాగ, మూఢులు, వారిలాగే, చేతనత్వం, రప్పించుకోగలము, వెనువెంటనే, రాకున్నా, క్రమంగా, దశాబ్దాలకు, రాగలదు, దిశలో, శుభం, భూయాత్, భాషోద్ధారణమనగా, మాండలికాలకు, చెయ్యాలి, బదులు, మరొకరి, రుద్దడము, అన్యాయము, కాదా, బ్రిటిషువారి, కపట, రాజనీతి, దేశములో, చొచ్చుకువచ్చిన, కులకుంపటి, చెలరేగిపోతున్నది, మహాశయుడు, ఆంగ్లమును, పురోగమనానికి, సమానత్వానికి, వారధిగా, చూసాడు, దురదృష్టము, నిజచరిత్రలో, ఆంగ్లేయుల, అమానుషాలకు, అణగారిన, నిమ్నవర్గాల, స్మృతికి, వాదనము, అపరాధము, విశిష్టమేధావి, గనుక, క్రమంలో, సంస్కృతమును, ద్వేషభావనతో, చూడలేదు, దేశ, సామరస్యానికి, సారస్వతవారసత్వానికి, నిజాయితీయైన, దేశభాషగా, సంస్కృతమొక్కటే, మనగలదని, విశ్వసించాడు, మరొక, జాడ్యము, ఆర్యుల, వలస, పచ్చి, జాత్యహంకారము, బయలుదేరిన, బిషప్, కాల్డ్వెల్, జాతివాదుల, చలువ, చేత, భాషాశాస్త్రములో, అడుగిడింది, పెరియార్, మొదలుకొని, అనేకులైన, ద్రవిడజాతీయవాదులను, ప్రభావితం, చేసింది, నిజానికి, సంస్కృతశబ్దకోశములో, ఇతర, ప్రాపంచికభాషల, పాలు, దాక్షిణాత్యభాషలలో, క్రియాపదాలు, సహితము, శబ్దకోశమంతా, సంస్కృతముతో, పెనవేసుకుని, శబ్దజాలమంతా, భారతభూభాగంలో, జనించినదే, చెప్పినట్లు, ఐరోపాభాషలతో, సహసాంగత్యము, వ్రేళ్లతో, లెక్కించబడునట్లవి, ఆర్యులు, ఎక్కడనుండి, వచ్చారన్న, భారతీయభాషా, పరంపరకు, సంబంధించినంత, వరకు, సందర్భాతీతమైనది, ప్రపంచంలోనే, అత్యుత్తమమైన, శాస్త్రకావ్యసంపత్తి, సొంతము, పరంపరను, చూస్తే, భాషలన్నింటా, ప్రభావము, ఇచ్చిపుచ్చుకలు, కనపడుతాయి, విశేషమేమీ, స్వభావతః, భారతీయులము, పుత్రులము, నైజమునే, వైజ్ఞానిక, శబ్దనిర్మాణమునకు, రప్పించడము, సహజమైన, విషయము, అలాగని, దేశ్యగ్రామ్య, పదజాలాలను, చులకన, చూడనవసరము, ఇవన్ని, చిహ్నాలే, పూర్వీకుల, వారసత్వమే, మంచిది, గీసుకోవడమే, వెఱ్ఱితనము, భాషలోనన్నా, సందర్భానుసారముగా, పర్వతాల, శబ్దజాలమో, పైరగాలి, తేలికైన, మాటలనో, వాడతాము, రెంటినీ, రంగరించి, సొంపైన, మాటల, కూర్పు, చేయువాడే, సుకవి, ఆంగ్లములోనూ, కనపడుతుంది, పరిభాషను, దినదినము, వినుట, గ్రీకు, లాటిను, పారంపరిక, భాషల, జనితమైన, మొరటుగా, ఆనవు, భాషలోనే, పుట్టించిన, మొదటితనం, కరుకుగానో, మోటగానో, అనిపిస్తాయి, దేశ్యశబ్దముల, జన్మించినా, శ్రేష్టసంస్కృతసమములైనా, మొదటిదనపు, ఎడబాటును, దాటి, భాషాప్రవాహానికి, కంచె, తీయాలి, దేశీయ, మాండలికాలు, లేస్తాయి, ప్రామాణికమైన, స్థిరపడుతుంది, ప్రతివాడు, స్వీయదృష్టిని, వ్యక్తీకరణాస్వేచ్ఛను, ప్రదర్శించకపోడు, ఇందులో, కొందరు, అక్కడక్కడా, పరభాషాపదాలను, వాడవచ్చు, తప్పేమీలాదు, స్వీయవారసత్వాన్ని, కాలదన్నడము, మధ్యనున్న, అన్యోన్యతను, గుర్తించకపోవడము, సొంత, అమ్మను, దూషించడం, వంటివి, వెఱ్ఱివేషాలను, భాషాభిమానులు, మానుకోవాలి, భాషోద్ధారణము, మంచిదే, పాఠ్యపుస్తకాలేవి, విద్యావనరులు, భారతీయభాషామాధ్యమాలలో, ప్రవేశపెట్టుట, మూర్ఖసాహసము, సహేతుకమైన, విజయవంతముగా, స్వీయభాషామాధ్యమాలలో, నడుపుకుంటున్న, ఐరోపావాసులు, ఆసియావాసులు, విద్యావనరులను, భాషల్లో, తెప్పించుకుంటున్నారు, ప్రక్రియలు, భారతీయభాషలకు, అన్వయించుకోవచ్చునా, పరిశీలించాలి, ఆశ్చర్యావహమైన, ఎల్లప్పుడూ, విద్యావ్యవస్థ, మల్లిన, తరువాతనే, వస్తాయి, మునుపున, విశ్వవిద్యాలయాల్లో, విద్యాక్రమము, నడుస్తుండగా, ఆచార్యులు, ఉపన్యసిస్తుండగా, విద్యావిభాగాలలో, పరీక్షలు, పరిశోధనాపత్రాలు, వ్రాస్తుండగా, ప్రయోగశాలలో, పరిశోధనలు, జరిగి, విషయసమీక్షలు, సర్వము, జన్మిస్తుండగా, కాలక్రమేణా, ప్రచురింపబడుతుంటాయి, సంగణనశాస్త్రం, సూక్ష్మజీవాణుశాస్త్రం, ప్రచండవేగంతో, ఉద్గమిస్తున్న, వైజ్ఞానికరంగాలలో, కాలానుక్రమముగా, వస్తూ, మొదట, పుస్తకాలు, విద్యాబోధనము, స్వీయభాషలలో, ప్రచురింపబడిన, పిదప, ఆంగ్లగ్రంథాలు, సంప్రదింపుకై, సూచింపబడుతూ, ప్రవేశము, కలిగియున్నప్పటికీ, భావవ్యక్తీకరణలో, సౌలభ్యము, కొరకు, మాతృభాషలనే, మెగ్గుచూపుతూంటారు, బోధనాపద్ధతులు, వ్యవహారాలు, సమాజంలోని, వెళ్లి, దర్శించినా, అవగతమవుతుంది, పరిచయము, పదిహేనేళ్లకు, పైగా, ఐరోపాలో, నివశించుట, వలననూ, భాషలలో, విద్యాబోధనావిధానములను, సునిశితముగా, చూసినవలననూ, తేటతెల్లముగా, వ్యక్తమగుతున్నది, నాలుగేళ్లుగా, వైకల్పితవాస్తవికము, కృత్రిమమేధ, అతిపురోగతమైన, పాఠ్యాంశాలను, స్వయముగా, విద్యార్థినీవిద్యార్థులకు, బోధించిన, విధానాలు, స్వీయాచరణచే, తెలిసి, దృష్టి, రావడానికి, పదేళ్లు, పట్టినది, ఆంగ్లభాషాదాస్యములో, మునిగితేలుతున్న, స్పృహ, కలుగకపోవుటలో, ఏమాత్రము, ఆశ్చర్యము, ప్రభుత్వపరంగా, సమస్యలను, పరిష్కరించుటకు, దేశవ్యాప్తముగా, సామరస్యము, పొందుటకు, వృత్తివిద్యలయందు, ఏకభాషనే, ఉండవలెను, సంపన్నహీనమైన, రాజ్యములయందు, కాలములో, చెల్లుబాటైన, ఆర్థికపరిపుష్టికి, అందుబాటులోనున్న, సంగణక, సాంకేతికసాధనాసామాగ్రికి, సమయోచితము, కేవలము, జంకుబాటు, దేశములలో, ప్రభుత్వయంత్రాంగము, న్యాయవాదయంత్రాంగము, బహుభాషామాధ్యములలో, లభ్యమవుతున్నాయి, మేలైన, ఉదాహరణ, స్విస్, మూడు, సమానాధికారము, సర్వప్రభుత్వసదుపాయాలను, పౌరులకు, అందిస్తున్నాయి, ఐరోపా, ఐక్యసమితిలో, ఐరోపాభాషలలో, ప్రజలకు, సేవలు, అందుతున్నాయి, మనదేశములో, సంస్కృతభాషావారసత్వఫలము, ఉచ్ఛన్యాయస్థానాలు, ప్రభుత్వవ్యవస్థలు, సేవలనందించడం, దాస్యభావన, మాత్రమే, ఇప్పటికీ, కొనసాగడము, అందలేకపోతుండము, దౌర్భాగ్యము, మూర్ఖత్వము, తప్ప, మరేదీ, భాషాబాహుళ్యమున్న, మనదేశానికి, ఆంగ్లమే, వృత్తివిద్యలలో, మాధ్యమముగా, ఉండాలన్న, అంశానికి, లంబకోణముగా, సంబంధరాహిత్యముగానున్న, అనాది, చరిత్రగల, మనదేశ, పరంపర, సారస్వతవారసత్వము, లేకనే, వచ్చాయా, పరాయి, భాషలైన, పారశీకము, ప్రజానీకాన్ని, సాంతము, అనుసంధానింపగలవా, మూఢాతిమూఢమైన, భావదాస్యము, మేధావులు, ఆంగ్లపక్షపాతులై, వాదిస్తున్నారు, దానికి, కాలానుగతముగా, పండితపామరబేధము, ప్రజలనందరినీ, కలుపుతూ, వచ్చింది, కాలంలో, కౌరవీ, సంస్కృత, భాషాద్వయము, చేతనే, యావత్భారతము, అనుసంధానింపబడగలదు, వాదించినట్లు, విద్యామాధ్యమభాష, కానేరదు, మాతృభాషలలోనే, విద్యాప్రతిభ, పొందగలరు, ఆర్థికరంగములలో, ఆచారవ్యవహారములలో, రాణించగలరు, ఆంగ్లమాధ్యమం, ప్రగతికి, చేస్తున్నవారు, ప్రగతిని, గడించిన, ఆసియా, దేశాలను, పట్టించుకోరు, వారంతా, స్వీయమాతృభాషలలోనే, వృత్తివిద్యలనభ్యసించి, యాంత్రీకరణము, ఎగుమతులనందించే, పరిశ్రమలు, సేవారంగములు, యావత్తూ, స్వంతభాషలలోనే, నడుపుకుంటున్నారు, ఉన్నతపరిశ్రమలు, నడుపుతున్న, వీటిలో, పాలుపంచుకోలేకపోతున్నారు, మాట్లాడగలువారు, సైతము, భాషాప్రతిభ, లేని, కార్యనిర్వహణలో, సృజనశీలురుగా, రాణించలేకపోతున్నారు, స్వీయ, తప్పిదమే, గతిలో, కనీసము, పాళ్లు, ఆంగ్లపు, సంకెళ్ల, కోల్పోతున్నట్లు, గ్రహించాలి, భాషాబానిసత్వము, తదోత్పన్నమైన, ఆర్థికవైకల్యము, వలసకారుల, వశీకరణకు, వశమైన, దేశాలనన్నింటిలోను, చూడవచ్చును, వీటికి, విరుద్ధము, స్వీయభాషాల, సముద్ధరణము, నిర్వశీకరణకు, అతిప్రధానమైన, చైతన్యానికి, ప్రతీక, ఆనబద్ద, భావవివేచనము, కలుగుతుంది, విలువలు, ఆశయాలు, రూపొందుతాయి, భాషనే, వికాసానికి, పునాది, అనవచ్చును, కెనడాదేశస్థ, తత్వవేత్త, యైన, చైతన్యపరిక్రమకు, తను, వినియోగించే, ఆనగా, సాధనసంపత్తిలో, సర్వోత్తృష్టమైనది, సూక్ష్మాతిసూక్ష్మకారకమైనది, భారతీయజ్ఞానపరంపరలో, అనాదిగా, పొదిగియున్నది, భర్తృహరి, వాక్యపదీయములో, మాధ్యమం, గుండా, చైతన్యము, ఉజ్జీవనము, జరుగుతుందో, విస్తృతముగా, వివరించియున్నాడు, జీర్ణించిననాడు, ఉన్నతవిద్యలు, యన్న, ప్రశ్నయే, ఉదయించదు, ఎందుకనగా, కోల్పోయిననాడు, అస్థిత్వమే, ప్రశ్నాస్పదమగుతుందని, అభిజ్ఞాతమవుతుంది, ఈనాటికాలంలో, అర్థార్జనే, ధర్మానికి, ఆద్యంతములన్న, మూఢాతిశయసంభ్రమము, చెందినవారే, అధికులు, వాదనలకు, క్రమానుక్రమంగా, ప్రతివాదనలు, ఇవ్వక, తప్పదు, కెనడాదేశస్థుడైన, తాత్వికుడు, మాధ్యమసిద్ధాంతీకరుడు, చేపట్టిన, పనిముట్లవలే, రూపొందుతాము, మలుచుతాము, మనలను, మలుచుతాయి, వారంలో, భాషోద్యమంలో, భాగంగానే, మధ్యప్రదేశ, రాష్ట్రంలో, వైద్యవిద్యలను, హిందీభాషలో, అందించుటకు, అక్కడి, నడుము, కట్టింది
Text of the page (random words):
ాలను కూడా వాడవచ్చు తప్పేమీలాదు కానీ స్వీయవారసత్వాన్ని కాలదన్నడము సంస్కృతము ద్వారా భారతీయభాషల మధ్యనున్న అన్యోన్యతను గుర్తించకపోవడము సొంత అమ్మను దూషించడం వంటివి ఈ వెఱ్ఱివేషాలను భాషాభిమానులు మానుకోవాలి మాతృభాషమాధ్యమంలో విద్యాబోధన ప్రాథమికవిద్యలోనే అవసరము ఉన్నతవిద్యలకు వృత్తివిద్యలకు అనవసరము అంతగా కల్పించాలనుకుంటే సాంఘికశాస్త్రాలలోనో సాహిత్యశాస్త్ర విభాగాలలోనో పెట్టాలి యంత్రనిర్మాణ వైద్యశాస్త్రాలలో పెడితే విద్యాప్రమాణాలు దెబ్బ తింటాయి ఈ వాదన చేసేవారు కూడా అత్యధికులు ఆంగ్లేతర దేశాలలో విశ్వవిద్యాలయాలు పనిచేసే తీరును దర్శించినవారు కాదు కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ఉండినట్లైతే విద్యార్థులకు సహజముగానే తమ మాతృభాషపై న్యూనతాభావము ఏర్పడుతుంది సమాజములో గుర్తింపుకు ధనార్జనకు పనికొచ్చే వృత్తివిద్యలు ఏ భాషలో లభ్యమవుతుంటే ఆ భాషకు మర్యాద లభిస్తుంది స్వాభిమానం కల ఏ జాతియైనా యోచించవలసిన విషయమేమిటంటే తమ మాతృభాషకు ఎందుకు ఆ మర్యాద దక్కలేదు అని ముఖ్యముగా కోట్లాది ప్రజలు మాట్లాడు భాషలు సమృద్ధమైన ప్రాకృతికసంపత్తి ఆర్థికప్రతిపత్తి గల భాషలు అన్ని వృత్తివిద్యలను శ్రేష్టాతిశ్రేష్టమైన విశ్వవిద్యాలయాలను కలిగియుండాలి అవి లేవు అంటే ఆ భాషను మాట్లాడే ప్రజల న్యూనతాభావనకు భావదాస్యానికి నిదర్శనలు ఇజ్రాయెల్ దేశంలో ప్రాచీన హీబ్రూ భాషను పునరిద్ధరించినప్పుడు మాట్లాడే ప్రజల సంఖ్య ఎంతనో లేకున్ననూ ఆ దేశపు అత్యున్నత విద్యాస్థానమైన టెక్నియాన్ యంత్రనిర్మాణవిద్యావిభాగాలను హీబ్రూభాషలో రూపొందించింది యాంత్రీకరణ ద్వారా దేశం ఆర్థికప్రగతి సాధిస్తూండగా ఈ భాషాప్రవాహం అన్ని సాంస్కృతిక విభాగాలకు వాణిజ్యవిభాగాలకు చేరింది మన భారతీయభాషల పునరుద్ధరణ మరింత సులభతరమైన కార్యము కానీ ఇదే విధంగా పారిశ్రామీకరణము ఆర్థిక పురోగతి సాధించుటకు మూలసాధనాలైన అన్ని విద్యావిభాగాలయందు అత్యున్నత స్థాయిలో అత్యున్నత విశ్వవిద్యాలయందు మాతృభాషలో విద్యాబోధన జరగాలి కనీసం ప్రత్యుమ్నాయంగా లభ్యమౌతూ ఉండాలి లేదంటే ఆత్మన్యూనత స్వాభిమానలోపము వలన పౌరులందరిలో మాతృభాషాపాటవము కృశించి క్రమక్రమముగా ఆంగ్లపుటెంగిలి చొరబడుతుంది ఇదే వైపరీత్యాన్ని ఈనాడు మనము మన ఉన్నతవర్గాలవారియందు అంతటా గమనిస్తున్నాము కానీ ఇదేమీ మన పూర్వకర్మనిర్దేశితము కాదు స్వంత చేష్టలతో చేజేతులా మనమే కల్పించుకున్నది మిగతా దేశాలవారు అనేకులు మనలాగ మూఢులు కాదు మనం కూడా వారిలాగే భాషలో చేతనత్వం రప్పించుకోగలము వెనువెంటనే రాకున్నా క్రమంగా కొన్ని దశాబ్దాలకు రాగలదు ఆ దిశలో శుభం భూయాత్ వ్యాఖ్యానించండి posted in uncategorized వాగ్బంధనం posted on మే 14 2022 వ్యాఖ్యానించండి కల్పితవార్తలకిక శెలవు నువ్వేంచూశావో నే చెప్తా విను తిండానికి మరీ తీపిగా మోసపెట్టడానికి ట్వీటుపెట్టడానికి వాగ్బంధనం సమాధానమివ్వని విషయాలు మరలా చెప్తాను నిజమంటే ఏదో ఒక రోజు తయారుచేయబడినదే మాటల్లో పెట్టలేని మాటలను నల్లగా పూతేయవచ్చు నీకేదన్నా పోయిందా అంటే ఒక కాగితపు ముక్కనే కల్పితవార్తలకిక శెలవు నువ్వేంచూశావో అది నేను చెప్తా విను ఏం తిండానికన్నా తియ్యగా మోసపెట్టడానికన్నా ట్వీటుపెట్టడానికన్నా జాగృతి అలా వేచిచూస్తోంది కల్పిత సంగీతపు లయలకు ఇక శెలవు అలా పట్టనట్టు నాట్యమాడుతూనే ఉండు తినడానికి ఏమి తినాలో తియ్యగా నే పెడ్తా కదా మోసపెట్టడానికి ట్వీటుపెట్టడానికి ఒంటరిగా నిలబెట్టి ఒంటరి సమాజం పద్ధతిలేని వ్యవస్థ ఆబగా కలవడం నగరగర్భంలో అపరిచయిస్తుల్లా వారి అద్దంలో నీ ప్రతిబింబం నేర్చుకున్న చేతకానితనం నడవడులు అలవాట్లు లక్ష్యం నిర్దేశం అన్నీ వదిలేసి చుట్టరికాలు వట్టిపోయి ఇలాంటి జనాలముందు ఓడిపోయి ఓర్వలేను గుంపులో విమర్శలు జట్టుకట్టడాలు రట్టుపెట్టడాలు వృత్తాల్లో వృత్తాల్లా గిరి గీసుకోవడాలు మూడో మనిషికి చోటు లేకుండా నీకు చెప్పకుండా ఉంటానని అనడం అస్పష్టం నిజం తెలుసుకోవడం కోసం విమర్శ వ్యక్తపరచాలి గదా సమాధానం చెప్పని సమాధానమేంటో గాలిని చదివి చూడు క్షమించు మరి నాకు గుర్తు లేదు నిజం పుట్టిన తరువాత పుట్టాను నేను ఏదో పాత్ర ధరించాలి నేను నమ్మాలి నేను నమ్మినట్లు చూడాలి నేను అద్దంలో ప్రతిబింబించినట్లు కల్పితవార్తలకిక శెలవు నువ్వేంచూశావో నే చెప్తా విను తిండానికి మరీ తీపిగా పెడ్తాను నేను మోసపెట్టడానికి ట్వీటుపెట్టడానికి ప్రపంచ నియమవిధి వర్ల్డ్ ఆర్డర్ అను జపానదేశ సంగీతబృందం గాయకుడు గెంకీ సూడో చే సమకూర్చబడింది సమకాలీన విషయాలపై ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి వీరి గీతాలు సంగీతానుక్రమంగా విశ్మయాస్పదమైన అద్భుత సమపాదగతితో నాట్యం చేస్తారు ఈ బృందం వ్యాఖ్యానించండి posted in uncategorized లేదు పరితాపమేదీ లేదు posted on నవంబర్ 4 2020 వ్యాఖ్యానించండి లేదు పరితాపమేదీ లేదు లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని అదంతా నాకు సమానమే లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు అదంతా భరించాను తుడిచిపెట్టేసాను మరిచిపోయాను గతమంటే వెఱ్ఱి నాకు లెక్కలేదు నా జ్ఞాపకాలతో నిప్పు రాజేస్తాను నేను నా దుఃఖాలతో నా సుఖాలతో వాటిమీద అవసరంలేదు నాకు తుడిచిపెట్టేసి ప్రణయాలన్నీ వాటి అలజడులన్నీ ఎప్పటికీ తుడిచిపేట్టేసి సున్నాపై మొదలౌతాను నేను లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని అదంతా నాకు సమానమే లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు ఎందుకంటే నా జీవితం నా ఆనందం ఈరోజు మొదలౌతోంది నీతోనే ఎదిత్ పియాఫ్ అను మహాగాయని 1956వ సంవత్సరంలో ఫ్రెంచిభాషలో పాడిన నోన్ జ న రెగ్రెత రియాన్ లేదు నాకు పరితాపమేదీ లేదు అను ఈ పాట ఫ్రాన్సుదేశంలోనేకాదు విశ్వవ్యాప్తంగా అతిప్రాచుర్యంలోకి వచ్చిన గీతాలలో ఒకటి ఈ పాటని చార్ల్ ద్యుమోన్ అను సంగీతకారుడు ఎదిత్ పియాఫ్ కోసమనే కృతిచేశాడు అప్పటికే ఆమె బాగా పేరొందిన గాయని మొదట్లో ద్యుమోన్ ని కలవడానికి సమయంలేదని శరీరం నీరసపడివుందని నిరాకరించిన పియాఫ్ ఈ పాటని ఆయన పియానోపై వాయిస్తే ఒకసారి విని మహాద్భుతం కచ్చితంగా ఈ పాటని పాడతాను కచ్చితంగా ఈ పాటతోనే ప్రజలందరి మనసుల్లోను గుర్తుండిపోతాను అని అందట ఆమె గొంతుతో లోలోపల నుండి వచ్చిన శక్తితో నిజంగానే ఈ పాటని మధురాతిమధురంగా ఆలపించింది ఫ్రెంచిభాషలో రెగ్రెత్ అంటే పశ్చాత్తాపం కానీ జె న రెగ్రెత్ రియాన్ నేను పశ్చాత్తాపపడట్లేదు అంటే పదాల వెనుక ఇంకో భావం ఉంది నేను తప్పుచేసాను అనిగాక ఇతరులు చేసిన పనులు నాకు ఇబ్బంది కలిగించవు అని అందుకని పరితాపమేదీ లేదు అను నేను తెలుగులో అనువదించాను ఎదిత్ పియాఫ్ జీవితంపై ల మోమ్ కుర్రది అను ఒక సినిమా కూడా 2007వ సంవత్సరంలో విడుదలయ్యింది పియాఫ్ పాత్రని మారియోన్ కోతియార్ అను ప్రముఖమైన ఫ్రెంచి అభినేత్రి పోషించింది ఎదిత్ పియాఫ్ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులను బాధలను ఉల్లాసాలను అలల్లాంటి అలజడిగా సాగిన వైనాలను హృద్యంగా చిత్రీకరించారు ఈ చిత్రికలో పాటలు కూడా ఆవిడే పాడింది ఈ సినిమాలో నోన్ రియాన్ ద రియాన్ అను పాటను ఆవిడ తిరిగి జీవంపోసిన వైనం క్రింద చూడవచ్చు వ్యాఖ్యానించండి posted in uncategorized అఁటిఁచబడ్డవి పాట తెలుగు అనువాదం విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట నల్లటి సీతాకోకచిలుకలు posted on నవంబర్ 4 2020 వ్యాఖ్యానించండి నల్లటి సీతాకోకచిలుకలు రాత్రి బాధలన్నీ కమ్ముతుండగా గుండెనిండుగా ప్రేమిస్తాం ఎప్పటికీ మాయమైపోవనివి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు వేరే అమ్మాయిలు నిన్ను కవ్విస్తున్నారు వేల దివ్వెలతో జిగేలుమనే నగలతో రాత్రినడుమన ఆకర్షిస్తున్నాయి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు మసకగా ప్రొద్దుటి వేకువ వెలుగున అద్దంలో కదలాడే అలజడి జలాన ఆకస్మికంగా నిన్ను నువ్వు కలిసినప్పుడు మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా ఆపై నీ చొక్కాపై చూశావు నువ్వు నీ గుండెకి దగ్గరగా పెట్టిన చొక్కాపై కోటు వేసుకునే ముందున జేబుపై నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని సార్జ్ గేన్స్బూర్ అను ఫ్రెంచి గాయకుడు కవి వ్రాసిన లే పాపియ్యోన్ నువార్ నల్లటి సీతాకోకచిలుకలు అను ఈ పాట 1966వ సంవత్సరంలో విడుదలయ్యింది ఈ పాటని గేన్స్బూర్తో కలిసి ఆలపించింది మిచేల్ ఆర్నో అను గాయని ఈమె మునుపు ఫ్రాన్సుదేశం తరుపున యూరోవిజన్ అను ఐరోపాస్థాయి గానస్పర్ధాకార్యక్రమంలో పాల్గొంది ఈ పాట ఈ గాయనీగాయకులిద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది గేన్స్బూర్ అప్పటికే పేరొందిన సంగీతకారుడిగా కవిగా గుర్తింపులోకి వచ్చాడు ఇతని పాటలు పొరలుపొరలుగా నిమిడిన గూఢమైన సాహిత్యంతో వివిధ ప్రాసాలంకారాలతో ఫ్రెంచిభాష పాటవ్యాన్ని ప్రదర్శిస్తుంటాయని అభిమానుల ప్రశంస ఈ నల్లటి సీతాకోకచిలుకలు అన్న పాట వివాహేతర రంకుసంబంధాన్ని నిగూఢంగా వర్ణిస్తోంది సీతాకోకచిలుకలు ప్రణయానికి వైవాహికబంధానికి ఐరోపాసంస్కృతిలో చిహ్నం అటువంటిది నల్లటి సీతాకోకచిలుకలు అంటే ఏదో తప్పు పని చేస్తున్న సమయానికి కలిగే భావనలకు చిహ్నంగా గేన్స్బూర్ సూక్ష్మంగా సూచిస్తున్నాడు ఇదే పాట బిజూ మణి ప్రేమికుడు అను ఒక సంగీతబృందం కూడా గేన్స్బూర్ తో కలిసి పాడింది ఆ ఆలాపనని క్రింద చూడవచ్చు వ్యాఖ్యానించండి posted in uncategorized అఁటిఁచబడ్డవి పాట తెలుగు అనువాదం ఫ్రాన్స గీతం విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు posted on నవంబర్ 3 2020 వ్యాఖ్యానించండి నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు వీధిలో నడిచిపోతున్నారు కలిసి ఇద్దరిద్దరు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఆనందంగా ఎట్లుండాలో వారికి బాగా తెలుసు ఆ కళ్ళల్లో కళ్ళుంచి ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు ప్రేమికులై మర్నాడంటే భయంలేక ఔను కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో గుండెదిగులుగా ఔను కానీ నేను ఒంటరిగా పోతాను నన్ను ప్రేమించేవాడు లేడుగనుక నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నా చెవిలో నిన్ను ప్రేమిస్తున్నా అని గుసగుసలాడరు ఎవరూ నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కడుతున్నారు భవిష్యత్తుకి పథకాలు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు తెలుసు వారికి బాగా ప్రేమించడం అంటే ఏమిటో ఆ కళ్ళల్లో కళ్ళుంచి ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు ప్రేమికులై మర్నాడంటే భయంలేక ఔను కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో గుండెదిగులుగా ఔను కానీ నేను ఒంటరిగా పోతాను నన్ను ప్రేమించేవాడు లేడుగనుక నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నాకోసం ఎప్పుడు ప్రకాశిస్తాడు దిండుగా మరి సూరీడు నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ తెలుసుకుంటానా మరి ప్రేమంటే ఏమిటో నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ అనుకుంటున్నా ఎప్పుడు వస్తుండా ఆ రోజని ఆ కళ్ళల్లో కళ్ళుంచే ఆ చేతిలో చేయుంచే గుండే నిండుగా ఆనందంగా మర్నాడంటే భయంలేక నా గుండె దిగులుగా అసలు ఉండనే ఉండని రోజు నన్ను కూడా నిండుగా ప్రేమించే ఎవరో కలిగుండే రోజు 1962వ సంవత్సరంలో ఫ్రాన్సువాజ్ హార్డీ అనే గాయని పాడి విడుదల చేసిన తూ లె గార్సోంజె లె ఫియ్ ద మోనాజ్ నా వయసులోని అందరు అబ్బాయిలు అమ్మాయిలు అన్న ఫ్రెంచిపాట ఇది ఆ 60వ దశకంలో ఫ్రాన్సుదేశంలో వచ్చిన ఈ సంగీతాన్ని యే యే సంగీతం అంటారు పడుచు అమ్మాయిలు పాడిన ఈ యే యే పాటలు అమెరికాదేశం నుండి వస్తున్న సంగీతపద్ధతులను జావళీలను ఫ్రెంచిభాషలో ఫ్రెంచి సంస్కృతికి అన్వయించాయి ఎందరో మంచి గాయనులు అప్పుడు వెలుగులోకి వచ్చినా అందులో ఫ్రాన్సువాజ్ హార్డీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈమె ఎన్నెన్నో దశాబ్దాలుగా మధురమైన పాటలు ఆలపించి ఎందరో అభిమానులను చేగొంది వ్యాఖ్యానించండి posted in uncategorized అఁటిఁచబడ్డవి పాట తెలుగు అనువాదం విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట శతాక్షర వజ్రసత్వమంత్రం జీవించి ఉండడం సా డింగ్ డింగ్ గీతం posted on నవంబర్ 1 2020 వ్యాఖ్యానించండి శతాక్షర వజ్రసత్వమంత్రం ఓం వజ్రసత్వ సమయమనుపాలయ వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ సుతోష్యో మే భవ సుపోష్యో మే భవ అనురక్తో మే భవ సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః తెలుగులో అన్వయం ఓం వజ్రసత్వ సమయమనుపాలయ ఓం వజ్రశక్తినిగలవాడా ఇంద్రుడా సాధకునికి దేవునికి మధ్యన గల యజ్ఞబంధమనే ఒప్పందాన్ని అనుపాలించు పాటించు వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ నీ వజ్రశక్తినిగలిగిన తత్వంతో నాతో దృఢంగా కలిసివుండు సుతోష్యో మే భవ నాయందు సంతుష్టుడై ఉండు సుపోష్యో మే భవ నాయందు సుపోషకుడివై ఉండు అనురక్తో మే భవ నాయందు అనురాగివై ఉండు సర్వ సిద్ధిం మే ప్రయచ్ఛ అన్ని సిద్ధులు నాకు కల్పించు సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నాయందు శ్రేయస్సు నిర్మలత్వము కలిగిన చిత్తము మనస్సు కల్పించు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ ఓ భగవంతుడా అన్ని స్థితులయందు తఠస్థతతో నిండిన బౌద్ధతత్వం కల్పించు వజ్రతత్వముగలవాడా నన్ను విడనాడకు వజ్రీ భవ మహాసమయసత్వ యజ్ఞబంధమనే ఒప్పందము ద్వారా వజ్రతత్వము కలిగి నాకు ప్రత్యక్షమవ్వు ఆః సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నా చిత్తము నిర్మలముగా చేయి హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ భగవంతుడా సర్వ తథాగత గుణంతో వజ్రతత్వం కలిగినవాడా నన్ను విడనాడకు వజ్రీ భవ మహాసమయసత్వ మహాసమయసత్వముతో యజ్ఞబంధముని అనుసరించిన తత్వముతో వజ్రతత్వముగలవాడై నన్ను అనుగ్రహించు ఆః చీనేయగాయని సా డింగ్ డింగ్ 2007వ సంవత్సరంలో విడుదలచేసిన వాన్వూషెంగ్ జీవించి ఉండడం ఆంగ్లంలో ఎలైవ్ అను సంగీతముద్రణలోని ఒక సంస్కృతశ్లోకం ఇది ఈ శ్లోకం శతాక్షర వజ్రసత్వమంత్రం అను బహుప్రసిద్ధమైన బౌద్ధమంత్రం దీనిని గానరూపంలో ఈమె పాడి అలరించింది ఈ మంత్రంలో వజ్రతత్వంకలిగిన ఇంద్రుని అనుగ్రహం సాధకుడు అడుగుతున్నాడు వజ్రం ఇంద్రుని ఆయుధం కదా ధ్యానచింతనలో ఈ వజ్రం అంటే ప్రగాఢమైన జ్ఞానాన్ని మనసులోకి ప్రత్యక్షింపజేసే అంతర్దృష్టి అజ్ఞానాన్ని ఛేదించి మనోపలకాలపైన దివ్యమైన కాంతిరూపంలోని జ్ఞానాన్ని మెరుపులా ప్రత్యక్షింపజేసేదే ఈ వజ్రాయుధం బౌద్ధమతంలో ఈ వజ్రశక్తిని కలిగిన దేవతను వజ్రసత్త్వుడని పిలుస్తారు తనని ఒక ఉత్కృష్ఠమైన బుద్ధావతారంగా కొలుస్తారు అటువంటి దేవతను సాధకుడు యజ్ఞబంధం అనుసరించి నిష్ఠగా ధ్యానంచేసిన భక్తునిపై కచ్చితంగా అనుగ్రహించు అను వేడుతున్నాడు బౌద్ధమతంలో అత్యున్నత ధ్యానతత్వాన్ని తథాగత అంటారు తఠత అంటే ఎట్లు ఉన్నదో తఠస్థంగా అట్లే మనసులో అంగీకరించడం అని మనోవికారాలు ఏమీ లేకుండా అన్నింటిపైన వైరాగ్యంతో కూడిన నిర్మలతత్వంతో ఉండడం అన్నమాట మరి గత అంటే కదులుతూ ఉండడం ఈ స్థితి నిదానంగా ఉండేది కాదు ఋతుక్రమంలో కదులుతూ సమయం ముందుకువెళ్తున్నా మనస్చిత్తం మాత్రం నిర్మలంగా అట్లే ఉంటూ కదలడం అన్నమాట అందుకని బుద్ధుడిని తథాగతుడు అని కూడా పిలుస్తారు చీనేయగాయని పాడిన స్వరాలలో సహజంగానే సంస్కృతోచ్ఛారణలో అపస్వరాలు దొర్లుతాయి కానీ వాటికి ఇబ్బందులు పడకుండా పాటని అనుబంధమైన చిత్రికను ఆస్వాదించండి వ్యాఖ్యానించండి posted in uncategorized అఁటిఁచబడ్డవి పాట తెలుగు అనువాదం విశ్వవ్యాప్తిమైన తెలుగు పాట పైకి చంద్రునివైపుకి posted on అక్టోబర్ 31 2020 వ్యాఖ్యానించండి పైకి చంద్రునివైపుకి ఎడమచేయి భూమిని పట్టుంది కుడిచేయి ఆకాశాన్ని పట్టుంది నా అరచేతిరేఖలపై బద్దలయ్యింది అన్నివైపులా మెరుపులాడుతూ కాలమనే కెరటాన్ని ఏరుకుని సంవత్సరాలుగా ఇట్టే పూతపోసి మూడువేల జన్మలు సాంతం గడిచినా ఇంకా మనం కలుసుకోలేదన్నట్టుగా ఎడమచేయి ఒక పువ్వుని త్రెంచింది కుడిచేయి ఒక ఖడ్గాన్ని ఆడించింది ఆ కనుబొమ్మలకి మధ్యన జారింది ఓ వేయి సంవత్సరాల మంచురేఖ ఒక అశ్రుబిందువు ఆహా ఆహా నేను అవతరించాను ఆహా ఆహా ఎడమచేయి తాళం మ్రోగించింది కుడిచేయి వీణాస్వరాలని మీటింది మరుపు అనే ఓ మహానది జలాలపై ఒక నావ తేలుతూ వెళ్తోంది దుఃఖపులోతుల్లోనుండి కూడా ఒక అరుణపద్మం పుట్టగలదు ఆగవద్దు నా మనసును కదుపు లోలోపల పెనవేసుకున్న భావాలని ఎడమచేయి చంద్రునివైపుకు చూపిస్తోంది కుడిచేయి విధి యొక్క ఎర్రటిదారాలని చుడుతోంది మనం కోరుకున్న ప్రేమని దేవతలు నీకూ నాకూ వరమందించుగాక మిణుకులాడుతున్నా ఈ వెన్నెలలో ఆహా ఆహా నువ్వూనేనూ ఒకటై కలిసిపోగా ఆహా ఆహా ఎడమచేయి ఒక ఈకలాగ మారింది కుడిచేయి ఒక చేపమొప్పులాగా కొన్ని జీవితాలు ఆకాశంలో మబ్బులవాటున కొన్ని జీవితాలు కారడవుల్లోని నీడలచాటున సంతోషంగా నిన్ను అనుసరిస్తాను ఒక చిన్నటి మట్టినలకలా మారుతాను ఈ మనుష్యలోకపు సంసారంలో అన్ని అంచులనా తేలుతూ సాగుతూ ఎడమచేయి నిన్ను గట్టిగా పట్టుంది కుడిచేయి నిన్ను వదిలివేసి పోనిచ్చింది నా చేతులు గుప్పిట్లో బిగిస్తే నీ రూపం తిరిగి నా హృదయంలోకొస్తుంది ఒక సాంబ్రాణి ధూపంలా ఆహా ఆహా నువ్వూ నేను ఐక్యమయ్యాం అవిచ్ఛిన్నంగా అనంతంవరకూ సా డింగ్ డింగ్ అను చీనేయ గాయని పాడిన జువోషు జీ యువే ఎడమచేయి చంద్రునివైపుకి అన్న ఈ పాట షియాంగ్మీ చెంచెన్ జిన్రూ షువాంగ్ ప్రేమయొక్క భస్మాలు ఆంగ్లంలో ఏషెస్ ఆఫ్ లవ్ అనే చీనాదేశపు టివీ కథా కార్యక్రమంలో ప్రచురిచతమయ్యింది ఈ కథలో అమరలోకంలో ఒక దేవతాకన్యగా జన్మించిన జిన్మీ అనే పూలదేవతకి షుఫెంగ్ అను ఒక అగ్నిదేవతాకుమారునికి మధ్యన ప్రణయగాథ నడుస్తుంది పదివేల ఏళ్ళవరకూ ఈ ఇద్దరూ అనేకానాక ఘట్టాల నడుమ ప్రేమని ఐక్యంచేసుకోలేకపోతారు వివిధ దేవదానవమానవరూపాలలో జన్మనెత్తుతారు చివరికి విధినిక్షేపితమైన ప్రేమని అందుకొని ఐక్యం అవగలుగుతారు మన భారతదేశపు సంస్కృతివలనే చీనా సంస్కృతిలో కూడా ప్రాకృతికదేవతా ప్రభావం కర్మసిద్ధాంతము జన్మ పునర్జన్మలతో నిండిన సంసారము అంతిమంగా మోక్షసాధన వీటన్నింటిపైనా నమ్మకాలు ఉన్నాయి ఇటువంటి పోలికలు అనాదికాలం నుండీ ఈ రెండు సంస్కృతులలోనూ ఉన్నా బౌద్ధమతం చీనాలో వ్యాపించిన తరువాత అనేక భారతీయ సాంస్కృతిక చిహ్నాలు కూడా అక్కడ నెలకొన్నాయి చంద్రుడు అనగా అమరత్వానికి మోక్షప్రదమైన పరమానందానికి చిహ్నం ఈ చిహ్నం చీనా సంస్కృతిలో ఉన్నట్టే మన భారతదేశంలో కూడా ఉంది సోమరూపంలో చంద్రుడిని చూసినప్పుడు మన భారతదేశం యొక్క అసలు పేరు ఇందు అని ఈ పేరు కొన్నిచోట్ల పలకలేక హిందు అంటారని కానీ ఈ అసలు పేరు యొక్క అర్థం చంద్రుడు అని షువెన్ ఝాంగ్ హ్యువెన్ త్సాంగ్ అను భారతదేశంలో పన్నెండేళ్లు గడిపిన చీనా బౌద్ధయాత్రికుడు పేర్కొన్నాడు ఈ ఇందు అన్న పదం వైదికక్రతువులలో సోమరసం పట్టే యూపపాత్ర ద్వారా వచ్చిందని కొందరి విజ్ఞుల అభిప్రాయం ఈ వైదిక యజ్ఞం ద్వారా ఆకాశంలో నక్షత్రాల గమనా...
|